జియో సేవల విస్తరణ


జియో టీవీ, జియో సినిమా అప్లికేషన్లను ఇప్పటివరకు కేవలం మొబైల్‌లో మాత్రమేవీక్షించే వీలుండేది. ఇకపై వాటిని కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లో సైతం వినియోగించే అవకాశాన్ని జియో కల్పిస్తోంది. తాజాగా ఈ సదుపాయాన్ని జియో ప్రవేశపెట్టింది. జియో లైవ్‌టీవీ, జియో సినిమాకు సంబంధించి కేవలం మొబైల్‌ యాప్స్‌ మత్రమే అందుబాటులో ఉండేవి. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లో వినియోగించే విధంగా వెబ్‌ వెర్షన్‌ను కూడా అందించాలని పెద్దఎత్తున చందాదారుల నుంచి జియోకు అభ్యర్థనలు వెళ్లాయి. దీంతో ఎట్టకేలకు ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఆయా అప్లికేషన్లను ఉపయోగించాలంటే జియో అకౌంట్‌తో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఇతరులకు ఈ అవకాశం లేదు. ఉచితంగానే ఈ సేవలను పొందొచ్చు. ప్రస్తుతం జియో టీవీలో సుమారు 550 లైవ్‌ ఛానెళ్లు ప్రసారం అవుతున్నాయి. వీటితో పాటు తెలుగు, హిందీ సహా పలు భాషల సినిమాలు జియో సినిమాలో అందుబాటులో ఉన్నాయి. తాజా సదుపాయంతో ఇకపై యూజర్లు ఆయా అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకోకుండానే మొబైల్‌ బ్రౌజర్లలో లాగిన్‌ అయ్యి ఉపయోగించుకునే వీలుంది.

ముఖ్యాంశాలు