యుద్ధం ఎప్పుడొచ్చినా సరే.. సిద్ధం


యుద్ధం ఏ క్షణంలో వచ్చినా సరే మన రక్షణ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని, శత్రువులు ఎటువైపు నుంచి ఎలా వచ్చినా తిప్పి కొట్టే సత్తా భారత్ కి ఉందని నౌకా దళాధిపతి అడ్మిరల్‌ సునీల్‌ లాంబ స్పష్టం చేశారు. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం జరిగిన పైలెట్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నావికా దళాన్ని బలోపేతం చేస్తున్నాం అన్నారు. నేవల్‌ ఎయిర్‌ వింగ్‌తో పేరుతో ప్రత్యేక విభాగముందని, 238 ఫైటర్లు, హెలికాప్టర్లు, మారీటైం పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సంఖ్య మరింత పెంచుతామన్నారు. నౌకదళంలో ఇటీవల చేరిన జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కల్వరి విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. మేకిన్‌ ఇండియా నినాదానికి నౌకదళం కట్టుబడి ఉందన్నారు. ఇక్కడి షిప్‌యార్డుల్లో 34 నౌకలు, జలాంతర్గాములను తయారు చేస్తున్నాం అని, వివిధ దేశాలకు చెందిన 20 నావికా దళాలతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. సువిశాలమైన హిందూ మహా సముద్రంలో మన ఆధిపత్యం ఉందన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం