రజనీ రాకపై క్లారిటీ వస్తోంది !


rajanikanth

రజనీకాంత్ అంటేనే ఒక సంచలనం... ఒక ఉప్పెన. అలాంటి రజనీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా అడుగు పెడితే అలా ఇలా ఉండదు అనేది తెలిసిన సంగతే. మూడు రాష్ట్రాలతో ఆయనకు సంబంధం ఉంది. దేశం అంత ఆయన సినిమాలు స్ట్రెయిట్ హీరోలతో పోటీ పది ఆడతాయి. ముక్కుసూటి వైఖరి, మంచితనం, నిరాడంబరత, మాటిస్తే నిలుపుకునే తత్త్వం, దైవభక్తి ఇవన్నీ రజనీకాంత్ అదనపు అర్హతలు. కండక్టర్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించిన ఆయన సూపర్ స్టార్ గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించారు. దశాబ్దాలుగా అగ్రనాయకుడిగా కొనసాగుతున్న రజనీ సినిమా అంటే అభిమానులు నెలల ముందునుంచే ఎదురు చూస్తారు. పాలాభిషేకాలు చేస్తారు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా హంగామా చేస్తారు. ఆయన సినిమా టికెట్ సంపాదించడం కంటే ఆయనతో సినిమా తీయడం ఈజీ అనే జోక్ కూడా ప్రచారంలో ఉంది. అలాంటి క్రేజ్ ఉన్న రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని అభిమానులే ఆశపడుతున్నారు. ఎన్నోసార్లు వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంతవరకు సూపర్‌స్టార్‌ మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. రెండు దశాబ్దాలకుపైగా ఆయన రాజకీయ ప్రవేశంపై తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికీ ఆయన ఎప్పుడు పార్టీ ప్రకటిస్తారు, ఏదైనా పార్టీలో చేరతారా, సొంత పార్టీ పెడుతారా? వంటి సమాధానం లేని ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు, సన్నిహితులు, సోదరుడు, స్నేహితులు, ఇతర పార్టీల నేతలు తమకు తోచింది చెప్పి అభిమానులను ఆసక్తిని కొనసాగిస్తూ వస్తున్నారు. రజనీకాంత్‌ మౌనం వీడే తరుణం ఆసన్నమైందని, ఇక అయన మాట్లాడతారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు చూసిన రజనీకాంత్‌ వేరని, ఎవరూ చూడని ఆయనలోని మరో కోణాన్ని త్వరలో చూస్తారని రజనీ స్నేహితుడు రాజ్‌ బహదూర్‌ వెల్లడించారు. ఆ కోణం తమిళనాడు తలరాతను మార్చుతుందని కూడా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటికే ఆయన సోదరుడు సత్యనారాయణ రావు ఇప్పటికే పార్టీని ప్రకటిస్తారని పలు సార్లు తెలిపారు. వాస్తవానికి ఈ నెల 12న తన పుట్టిన రోజు సందర్భంగా రజనీ ఈ ప్రకటన చేస్తారని అభిమానులు ఆశించారు. అయితే అలా జరగకపోవడంతో కలత చెంది కొంత మంది ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు అభిమానులతో రెండో విడత సమావేశానికి రజనీ ఏర్పాట్లు చేసారు. ఈ సారి రాజకీయాలపై రజనీ అటోఇటో తేల్చేస్తారని, అభిమానులకు కూడా స్పష్ట ఇస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం ఖాయం... త్వరలో పార్టీ ప్రకటన చేస్తారు. ఆరు నెలల్లో సొంత పార్టీ పెడుతారు....’ వంటి ప్రకటనలను