లెగటుం ప్రాస్పెరిటీ ఇండెక్స్ లో భారత్ కి 100 వ ర్యాంకు


డీ మోనిటైజేషన్, జీఎస్టీ వంటి ఆర్ధిక సంస్కరణల కారణంగా భారత్ మరొక విజయం సాధించింది. ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటిసారి టాప్ 100 లో స్థానం సంపాదించిన భారతదేశం ఇప్పుడు లెగటుం ప్రాస్పెరిటీ ఇండెక్స్ లో మొదటిసారి టాప్ 100 లొ స్థానం సంపాదించి, 100 వ స్థానంలొ నిలిచింది. 2016 లొ 104 వ స్థానంలొ ఉన్న భారత్ ఇప్పుడు మరొక నాలుగు స్థానాలు మెరుగుపరచు కుని మొదటిసారి 100 వ స్థానానికి చేరుకుంది.బ్రిక్స్ దేశాలలొ ఈ ఇండెక్స్ లొ స్థానాలు మెరుగుపరచుకున్న ఏకైక దేశం భారత్ మాత్రమే కావడం విశేషం. లండన్ లొని సుప్రసిద్ద లెగటుం ఇనిస్టిట్యుట్ ఇచ్చే ఈ ర్యాంకులలొ మొత్తంగా తొమ్మిది విభాగాలలొ జరిగే అభివ్రుధిని చూసి ఈ ర్యాంకులు ఇస్థారు. ఆర్ధిక పరిస్తితి (స్థిరత్వం) లొ 54 వ స్థానం సంపాదించిన భారత్, వ్యాపారానికి అనుకూలంగా ఉండే దేశాల జాబితాలొ భారత్ 21 స్థానాలను మెరుగుపరచుకుని 65 వ స్థానానికి చేరడం విశేషం. వ్యాపార అనుకూల వాతావరణం గల దేశాల జాబితాలొ అత్యధిక స్థానాలు మొరుగు పరచుకున్న రెండవ దేశం భారత్ కావడం విశేషం. కాగా పరిపాలన విషయంలొ అత్యధికంగా 41 వ స్థానంలొ ఉన్న భారత్, సోషల్ క్యాపిటల్ లో 82 వ స్థానం సంపాదించింది. అయితే సహజ వనరులు, ఆరొగ్యం, విద్యా రంగాలలొ భారత్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఈ సంస్థ పేర్కొంది. చైనా ఈసారి కూడా 90 వ స్థానంలొనే ఉండగా, భారత్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని మొదటిసారి 100 వ ర్యాంకును సాధించింది. కాగా ఈ ర్యాంకుల వలన భారత్ కు పరపతి పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యాంశాలు