ఆ ఓటమి వల్లనే వాజ్ పేయి మంచం పట్టారా?


2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవడంతోనే మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి కుంగిపోయి మంచం పట్టారా? అవునని గట్టిగా చెబుతున్నారు భారతీయ జనతాపార్టీ ప్రముఖ నాయకులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు. 2004 లో తెలుగుదేశంతో పొత్తు కారణంగా, ఆ పార్టీ ఆహ్వానం మేరకు దేశంలో, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం చారిత్రక తప్పిదమని సోము అన్నారు. విజయవాడలో ఆయన ఈవాళ మీడియాతో మాట్లాడుతూ 2014లో నిజానికి తాము (బిజెపి) ఒంటరిపోరుకు సిద్దమై ఉన్నామన్నారు. అయితే అదే సమయంలో తెదేపా పొత్తుకు ఆహ్వానించిందని, ముందస్తు పోటీకి ప్రోత్సహించింది తెలిపారు. తెదేపా కారణంగానే ఆనాడు ముందస్తు ఎన్నికలకు వెళ్లామని అన్యాపదేశంగా చెప్పారు. ఆ ఎన్నికల్లో భాజపాకు కేటాయించిన సీట్లలో నాలుగు చోట్ల తెదేపా తిరుగుబాటు అభ్యర్థులు నిలబడ్డారని, కాకినాడ కార్పోరేషన్‌ ఎన్నికల్లోనూ అలాగే జరిగిందని సోము ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో భాజపా వల్లే తెదేపా అధికారంలోకి వచ్చిందని ఏనాడూ తాము చెప్పలేదని, కానీ తెదేపా నేతలు మాత్రం తమ వల్లే భాజపా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెలుచుకుందని దుష్ప్రచారం చేస్తూ ఉండడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం