తప్పు తెలుసుకుని లెంపలేసుకున్న ఎంపీ!

గుజరాత్ ఎన్నికలు జరిగిపోయాయి.. ఇక ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు మాత్రమే ఉంది. సరిగ్గా ఆ సమయంలో భాజపా ఎంపీ సంజయ్‌ కకడే ఆకస్మికంగా ఓ బాంబు పేల్చారు.  గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థాయిలో భాజపా మెజారిటీ సాధించలేదని ఆ ఎంపీ ఢంకా బజాయించారు. అయితే ఈవీఎం లో తెరిస్తే అతడి అంచనాలు తలకిందులు కావడం.. రెండు రాష్ట్రాల్లోనూ భాజపా స్పష్టమైన మెజారిటీని దక్కించుకోవడం తెలిసిన విషయాలే. దీంతో డంగైపోయి న సంజయ్ ఇప్పుడు తన తప్పుడు మాటకు లెంపలేసుకుంటున్నారు. మోదీ సత్తా గురించి ఆలోచించకుండా ఈ వ్యాఖ్యలు చేశానని ఆయన అంటున్నారిప్పుడు. మోదీ హీరో అయితే తాను జీరో అన్నారు! మోదీ బలం, సత్తా, జనాకర్షణ గురించి తానూ, తన టీమ్ ఆలోచించలేదన్నారు. మోదీకి ఉన్న జనాకర్షణే ఈ ఎన్నికల్లో ఆరుగురు వ్యక్తులున్న ఓ బృందాన్ని ఏర్పాటుచేసి గుజరాత్‌లో సంజయ్ సర్వే చేయించారు. వాళ్లంతా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో క్షుణ్ణంగా సర్వే చేశారు. ఈ సర్వే నివేదిక ప్రకారం గుజరాత్‌లో భాజపా పరాజయం పాలవుతుందని... ఎక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ భాజపాకు దక్కదని సంజయ్‌ వ్యాఖ్యానించారు.