నడిపించింది అభిమానులే - పవన్ కళ్యాణ్


ఖుషి సినిమా తర్వాత మరో ఐదు సినిమాలు చేసి వెళ్లిపోదామనుకున్న తనను 25 సినిమాల వరకు నడిపించింది తన అభిమానులేనని కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆయన తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ సినిమాల్లోకి వచ్చేటప్పుడు ఇంత అభిమానం పొందుతానని అనుకోలేదన్నారు. 10, 15 సినిమాలు చేస్తాననుకున్నా. జానీ అపజయం తర్వాత కుంగిపోయానని కానీ అభిమానుల అండతో నిలదొక్కుకున్నానని చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్‌ దీ తనదీ ఒకటే భావజాలం అన్నారు. నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు తనను త్రివిక్రమ్ ఉత్తేజపరిచారన్నారు. డిస్ట్రిబ్యూటర్లకు అండగా నిలవాల్సిన నిర్మాతలు కనుమరుగైపోతున్న సమయంలో నిర్మాత రాధాకృష్ణ ఆ పాతకాలపు విలువల్ని పునరుద్ధరించారని చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ఈ కథను పవన్‌ కళ్యాణ్ కి రెండే నిమిషాలు చెప్పానన్నారు. ఇందులో పవన్ నట విశ్వరూపం చూస్తారని చెప్పారు. అభిమానులంతా కోరుకునే స్థాయికి పవన్ వెళ్లాలని ఆశిస్తున్నానాని త్రివిక్రమ్ తెలిపారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ ఇద్దరూ వాళ్ల డబ్బింగ్‌ వాళ్లే చెప్పుకున్నారంటూ ప్రశంసించారు. ఖుష్బూ కోసమే ఆ పాత్ర రాశానన్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ తాను పవన్‌ ఫ్యాన్‌ని అన్నారు. హీరోయిన్లు కీర్తి, అను, ఇంకా ఖుష్బూ,నిర్మాత దిల్‌ రాజు, రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ల భరణి, రావు రమేశ్‌, బొమన్‌ ఇరానీ, మురళీ శర్మ తదితరులు పాల్గొన్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ముఖ్యాంశాలు