బిజెపి నేతలపై నోరు జారొద్దు


పార్టీ అనుమతి లేకుండా మిత్రపక్షం భాజపాపై ఎవరూ నోరు జారొద్దని నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భాజపా నేతలు తెలుగుదేశంపై విచక్షణ మరచి విమర్శలు చేసినా అది వారి విజ్ఞతకే వదిలేయాలని ఆయన హితవు పలికారు. పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ తాజాగా బిజెపి నేత సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్ర ధర్మం పాటించాలని, అందులోనూ క్రమశిక్షణ కలిగిన తెదేపా శ్రేణులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. పార్టీ అనుమతి లేకుండా ఇష్టానుసారం మిత్రపక్షంపై ఎవరైనా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని బాబు హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా బాబు ఇలా ఈ మాట చెప్పిన కాసేపటికే ఆ పార్టీ ప్రతినిధి ముళ్ళపూడి రేణుక ఒక టీవీ ఛానల్లో బిజెపి రాష్ట్ర నేతల వైఖరిని కడిగి పారేయడం గమనార్హం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం