భాజపా నేతల వైఖరిపై షా కు బాబు ఫిర్యాదు?


రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వం పై కొందరు బిజెపి నేతలు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిజెపి అధిష్టానానికి ఫిర్యాదు చేసారా? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో భాజపా విజయాన్ని పురస్కరించుకొని అభినందించడం కోసం చంద్రబాబు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు మంగళవారం ఫోన్ చేసారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ అంశాలపై కూడా బాబు, షా చర్చించారని చెబుతున్నారు. ముఖ్యంగా తెదేపా, బిజెపి ఎమ్మెల్సీలు రాజేంద్ర ప్రసాద్, సోము వీర్రాజు మధ్య పొత్తు, పరస్పర సంబంధాల విషయంలో జరిగిన వాగ్యుద్ధం వీరి మధ్య చర్చకు వచ్చిందని తెలిసింది. కారణం లేకుండానే సోము తదితర బిజెపి నాయకులు తనను తక్కువ చేసి మాట్లాడుతున్నారని.. కార్యకర్తలలో పొత్తు విషయంలో అపోహలు సృష్టిస్తున్నారని బాబు వాపోయారని సమాచారం. అయితే బాబు ఫిర్యాదు చేయడం నిజమేనా అన్న విషయం పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదు. కానీ అమిత్ షా తో అయన రాష్ట్రంలో ఇరు పార్టీల పరిస్థితిపై కాసేపు చర్చించిన విషయం వాస్తవమని అంటున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం