కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 4 లక్షల పోస్టులు


కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో 4లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2016 మార్చి 1 నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ, మంత్రిత్వ శాఖల్లో 36,33,935 పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీటిల్లో 4,12,752 పోస్టులు ఖాళీగా ఉన్నాయి’ అని జితేంద్రసింగ్‌ తెలిపారు. త్వరలోనే వీటిని భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్‌ ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్దకు రాలేదని కూడా ఆయన వెల్లడించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం