లెక్కల్లో తేడాలున్నాయి.. జైట్లీ


పోలవరం ప్రాజెక్టుకు చట్టప్రకారం నిధులు సమకూరుస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. రెవెన్యూ లోటు భర్తీ విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు ఆయన భాజపా ఆంధ్రప్రదేశ్‌ శాఖ నేతలతో పేర్కొన్నట్టు సమాచారం. బుధవారం అరుణ్‌జైట్లీతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం భేటీ అయింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక ప్యాకేజీ అమలు తదితర అంశాలపై చర్చించారు. జైట్లీ మాట్లాడుతూ రెవెన్యూ లోటు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలకు వ్యత్యాసం వస్తోంది. అవకాశం ఉన్నంత త్వరగా భర్తీ చేస్తాం’ అని అన్నట్టు చెబుతున్నారు. పోలవరం, ప్రత్యేక ప్యాకేజీ అమలుకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భాజపాకు చెందిన రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ఉన్నారు.

ముఖ్యాంశాలు