సీఎం రేసులో లేను - స్మృతి ఇరానీ


గుజరాత్‌ సీఎం రేసులో తాను లేనని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేసారు. భాజపా అధిష్టానం గుజరాత్ సీఎంగా ఎవరిని ఎంపిక చేయబోతుంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో స్మృతి పేరు ప్రచారం అయింది. దీనిపై ఆమె బుధవారం స్పందించారు. సీఎం అభ్యర్థి రేసులో లేనని, అసత్యపు వార్తలు సృష్టించొద్దని ఆమె మీడియా కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతమున్న విజయ్‌ రూపానీనే సీఎంగా మళ్లీ కొనసాగుతారా? లేదా కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రధాని మోదీ, భాజపా కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు రూపానీ తెలిపారు. గుజరాత్‌లో కొత్త ప్రభుత్వం ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేయవచ్చని భాజపా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి పేరు కూడా అప్పుడే ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ముఖ్యాంశాలు