2015-16 లో పెరిగిన కోటీశ్వరుల సంఖ్య


2015-16 లో దేశంలో కోటీశ్వరుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రూ.కోటి ఆదాయం ఉన్న వ్యక్తుల సంఖ్య సుమారు 23.5శాతం పెరిగిందని ఆదాయపు పన్నుశాఖ తెలిపింది. అయితే క్రితం ఏడాదితో పోలిస్తే వారిలో కొంతమంది ఆదాయం తగ్గినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారనే దానికి సంబంధించిన జాబితాను ఐటీశాఖ అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం 2015-16లో దాదాపు 59,830 మంది వ్యక్తుల ఆదాయం కోటి పైగా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కోటీశ్వరుల సంఖ్య 48,417గా ఉంది. 1.2బిలియన్ల మంది పౌరుల్లో 4.07కోట్ల మంది 2015-16 ఏడాదిలో పన్ను రిటర్నులు దాఖలు చేశారు. దాదాపు 82లక్షల మంది వారి ఆదాయాన్ని 2.5లక్షల కంటే తక్కువ చూపించారు. ప్రస్తుతం 2.5లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను విధించడం లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 3.65కోట్ల మంది పన్ను రిటర్లు దాఖలు చేసి 1.37కోట్ల మంది ఆదాయాన్ని 2.5లక్షల కంటే తక్కువ చూపించారు. 55,331 మంది వ్యక్తుల ఆదాయం కోటి నుంచి రూ.5కోట్ల వరకు ఉండగా.. 3,020 మంది ఆదాయం రూ.5కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు ఉంటుంది. మొత్తం 1,156 మంది వ్యక్తుల ఆదాయం రూ.10కోట్ల నుంచి రూ.25కోట్ల మధ్య ఉంటుంది. 2015-16 ఆర్థిక ఏడాదిలో రూ.500కోట్లపైన ఆదాయం ఉన్న వ్యక్తి దేశంలో ఒకే ఒక్కరు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం