EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

ఇన్‌ఛార్జి ఆర్టీవో అక్రమాస్తుల పట్టివేత

నెల్లూరులో రవాణా శాఖ పరిపాలనా అధికారి (ఏవో), ఇన్‌ఛార్జి ఆర్టీవోగా పనిచేస్తున్న బొల్లాపల్లి శేషాద్రి కృష్ణకిశోర్‌, ఆయన బంధువుల నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఏక కాలంలో నెల్లూరు, గుంటూరు జిలాల్లోని నరసరావుపేట, పిడుగురాళ్ల, ఒంగోలు, విశాఖపట్నం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి పెద్దఎత్తున అక్రమాస్తులను గుర్తించారు. సోదాల్లో దాదాపు రూ.2.5కోట్ల విలువైన చర, స్థిర ఆస్తులను గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గురువారం సాయంత్రం కృష్ణకిశోర్‌ను అనిశా అధికారులు విజయవాడ నుంచి నెల్లూరు తీసుకుని వచ్చి ఇంటి తలుపులు తెరచి తనిఖీలు చేపట్టారు. అనంతరం కృష్ణకిశోర్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం ఎసిబి కోర్డులో అతడిని హాజరు పరుస్తారు. గుంటూరులోని కొరిటెపాడులో ఏవో తండ్రి వేంకటేశ్వర్లు నివాసంలో, పిడుగురాళ్లలో భార్య టి.అనురాధ నివాసంలో, నరసరావుపేటలోని ప్రకాశ్‌నగర్‌లో సోదరుడు బి.శ్రీనివాసరాంప్రసాద్‌ ఇంట్లో సోదాలు జరిగాయి. సోదరుడి నివాసంలో 6 కాలుష్య  నిర్ధారణ  సంచార వాహనాలతోపాటు, లారీలకు సంబంధించిన పత్రాలు లభించాయి. సోదరుని పేరుతో డ్రైవింగ్‌ స్కూల్‌కు సంబంధించి న లారీలు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 350 గ్రాముల వెండి వస్తువులు, రూ.1.37 లక్షల నగదు, తండ్రి పేరిట ప్రామిసరీ నోట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణకిశోర్‌ గుంటూరు రవాణా శాఖ కార్యాలయంలో 1991లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. 1997లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందార