చైనా యుద్ధానికి అసలు కారణం !


చైనా 1962లో భారత దేశం మీద ఎందుకు యుద్ధం ప్రకటించింది అంటే.. చైనాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు భారత్‌ను సాఫ్ట్‌ టార్గెట్‌గా (సులువైన లక్ష్యంగా) అప్పటి కమ్యూనిస్ట్‌ నేత మావో జిడాంగ్‌ భావించాడట. ‘చైనాస్‌ ఇండియా వార్‌’ అనే పుస్తకంలో ఈ సంగతి వెల్లడైంది. ఈ పుస్తకాన్ని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌ ప్రచురిం చింది. అప్పట్లో ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో కొత్తగా ఏర్పడిన స్వతంత్ర దేశాల్లో చైనాను బలపడేలా చేయాలన్న ఆలోచనే భారత్‌పై యుద్ధ ప్రకటనకు మరో కారణం అని స్వీడెన్‌ స్ట్రాటెజిక్‌ ఎఫైర్స్‌ నిపుణుడు బెర్టిల్‌ లింట్నర్‌ ఈ పుస్తకంలో రాశారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించిన ‘ఫార్వడ్‌ పాలసీ’ కూడా ఈ యుద్ధానికి దారితీయడానికి మరో కారణమని రాశా రు. ఈ విధానం ద్వారా చైనాకి చెందిన ప్రాంతాల్లో ఎక్కువగా భారత బలగాలను నియమించి పెట్రోలింగ్‌ నిర్వహిం చడంతో చైనా మండిపడింది. మావో ప్రకటించిన 1962యుద్ధంలో భారత్‌ చాలా నష్టపోయింది. టిబెట్‌ను చైనా 1959లో ఆక్రమించడంతో బౌద్ధ గురువు దలైలామా టిబెట్‌ నుంచి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందాడు. చైనాలో మావో తన స్థానాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం భారత్‌ను సాఫ్ట్‌ టార్గెట్‌గా చేసుకుని యుద్ధం ప్రకటించారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వద్ద ఇంటెలిజెన్స్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న భోలానాథ్‌ చైనా యుద్ధానికి సిద్ధపడేలా ఉందని పలుమార్లు నెహ్రూకి చెప్పినా ఆయన నమ్మలేదని దాంతో భారత్‌పై యుద్ధాన్ని ఆపలేకపో యారని ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు