రెండేళ్లలో 13 వేల వెబ్ సైట్ల రద్దు


గత రెండేళ్లలో చైనా 13వేల వెబ్‌సైట్ల లైసెన్స్‌లను రద్దు చేసింది. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2012లో జి జిన్‌పింగ్ అధికారంలో వచ్చిన తర్వాత ఇంటర్నెట్ రెగ్యులేషన్ విషయంలో కఠిన నిబంధనలు విధించింది. జిన్ పింగ్ అధ్యక్షుడయ్యాక దాదాపు కోటి ఇంటర్నెట్ అకౌంట్లు మూతబడ్డాయి. సర్వీస్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించినందుకు గాను వీటిపై వేటు పడినట్టు అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం