రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విందు


శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గౌరవార్థం గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేంద్రమంత్రి సుజనాచౌదరి, తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌, సినీనటుడు రానా, ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, మండలి ఛైర్మన్‌ ఫరూఖ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ రామ్మోహన్‌, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, ఎంపీలు కేశవరావు, చిరంజీవి, సుమన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ముఖ్యాంశాలు