హిమాచల్ ముఖ్యమంత్రిగా  జైరామ్‌ ఠాకూర్‌


హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి గా బిజెపి సీనియర్‌ నేత జైరామ్‌ ఠాకూర్‌ ఎంపికయ్యారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించినప్పటికీ సీఎం అభ్యర్థి ధుమాల్‌ అనూహ్యం గా ఓటమి పాలవడంతో సీఎం అభ్యర్థి గా మరొకరి ఎంపిక అనివార్యం అయింది. సీఎం రేసులో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేరు వినిపించినప్పటికీ చివరికి అదృష్టం ఠాకూర్‌ని వరించింది. భాజపా శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌ పాల్గొన్నారు. శాసనసభాపక్ష నేతగా ఠాకూర్‌ను ఎన్నుకున్నట్లు తోమర్‌ వెల్లడించారు. ఠాకూర్‌ వయసు 52 సంవత్సరాలు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన ఆయన మంత్రిగానూ పనిచేశారు.

ముఖ్యాంశాలు