29 న ప్రకాశం బ్యారేజి షష్టి పూర్తి ఉత్సవాలు


ప్రకాశం బ్యారేజీ షష్ఠిపూర్తి ఉత్సవాలను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. బ్యారేజీ నిర్మించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ 13.5లక్షల ఎకరాలకు ప్రకాశం బ్యారేజీ సాగునీరు అందిస్తోందన్నారు. రాష్ట్రం సస్య శ్యామలం కావడంలో ఈ బ్యారేజీది కీలకపాత్ర అని పేర్కొన్నారు. 2002, 2015 సంవత్సరాల్లో లో మరమ్మతులు చేయడం వల్ల ఎంత వరద నీరు వచ్చినా తట్టుకునేలా బ్యారేజీ సామర్థ్యం పెరిగిందన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం