అటల్జీ కి మోదీ జన్మదిన శుభాకాంక్షలు


మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతకుముందు మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "మా ప్రియమైన నేతకు జన్మదిన శుభాకాంక్షలు. మీ దార్శనిక నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. మీరు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని భవవంతుడిని కోరుకుంటున్నా" అని ఆ ట్వీట్‌ లో పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు కూడా వాజపేయికి వివిధ మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. కాగా సోషల్ మీడియా లో వాజపేయికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ముఖ్యాంశాలు