ఇక కర్ణాటకపై కమలనాథుల కన్ను


కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ యాత్రల ద్వారా ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళిక వేసింది. వచ్చే నాలుగు నెలల వ్యవధిలో ప్రధాని మోదీ కర్ణాటకలో 15–18 యాత్రలు, సమావేశాల్లో పాల్గొంటారని ఇప్పటికి అందిన సమాచారం. గుజరాత్‌ ఎన్నికల్లో విజయా నికి స్థానిక నేతల కంటే ప్రధాని మోదీ చరిష్మానే కారణమన్నది తెలిసిన విషయమే. గుజరాత్‌లో విస్తృతంగా పర్యటించిన నరేంద్రమోదీ అక్కడ పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకుని బీజేపీని గెలిపించారు. ఆ స్ఫూర్తితోనే కర్ణాటకలో కూడా మోదీ చెరిష్మాని పూర్తిగా వాడుకోవాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకులు అధికార కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కోలేకపో తున్నారని హైకమాండ్‌కు నివేదికలు అందడంతో పార్టీ పెద్దలు అమిత్‌ షా, నరేంద్రమోదీలు స్వయంగా తామే ఊపు తెచ్చి పార్టీ ని ముందుకు నడిపించాలని అనుకుంటున్నారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీ రానున్న నాలుగు నెలల్లో రాష్ట్రంలో సుడిగాలి యాత్రలు చేపట్టనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యాంశాలు