ఫేక్ ఫోటో తో బుక్కయిన హీరో


అలనాటి బాలీవుడ్ హీరో రిషి కపూర్ 65 ఏళ్ల వయసులో ఇప్పుడు వివాదాలను సృష్టిస్తున్నాడు. మొన్ననే పాకిస్థాన్ గురించి అమిత ప్రేమ చూపించి వివాదం సృష్టించి న ఈ కపూర్ తాజాగా క్రిస్మస్ ట్వీట్ లో తన పైత్యాన్ని మరోమారు చూపించాడు. ‘స్పిరిట్ అంటే ఇది.. మనుషులు విశ్వాసాల పరంగా విడిపోయినప్పటికీ మద్యం కలిపింది’ అంటూ ఓ స్వామీజీకి ముస్లిం మద్యం పోస్తున్నట్టుగా ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. అయితే అది ఫేక్ ఫొటో కావడం ఇక్కడ అసలైన వివాదం. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసత్యాలను, ఫేక్ ఫొటోలను ప్రచారం చేయొద్దని రిషి కపూర్ ని హెచ్చరిస్తున్నారు. ఓ నెటిజన్ ఒరిజినల్ ఫొటోని కూడా అక్కడ పోస్ట్ చేసారు. అది మందు బాటిల్ కాదు.. మంచి నీళ్ల బాటిల్ అంటూ కళ్ళు తిరిగే జవాబిచ్చాడా నీటిజెన్. క్రిస్మస్ రోజు క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్పకుండా హిందూ-ముస్లిం ఫొటోలను పోస్ట్ చేసి ఇలాంటి వక్రమైన ట్వీట్లు చేయడం లో అర్థం ఏమిటని నెటిజన్లు ఆ వెటరన్ హీరో ని నిలదీస్తున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us