ఫిలిప్పీన్స్ లో వరుస ప్రమాదాలు


క్రిస్మస్‌ పండుగ రోజు ఉత్తర ఫిలిప్పీన్స్ లో సోమవారం రోడ్డుప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన 20 మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. యాత్రికులతో బయల్దేరిన మినీ బస్సు మరో బస్సును అగూ నగరంలో ఢీకొట్టినపుడు ఈ దుర్ఘటన జరిగింది. మరో పదహేను మంది గాయపడ్డారు. క్రిస్మస్‌ సందర్భంగా వీరంతా శతాబ్దాల నాటి మనాగ్‌ చర్చిని చూసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని దావో నగరంలో ఉన్న ఎన్‌సీసీసీ షాపింగ్‌ మాల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 37 మంది మరణించిన దుర్ఘటన జరిగి రోజు గడవక ముందే ఈ ప్రమాదం జరగడం కుదిపివేసింది. .

ముఖ్యాంశాలు