బిజెపి పై మీడియా అక్కసు


భారతీయ జనతా పార్టీ అంటే మీడియా కి ఎందుకో అక్కసు, విద్వేషం. తాజాగా ఐదు స్థానాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. అందులో బిజెపి మూడు స్థానాలను గెలుచుకుంది. వీటిలో 2 కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కాగా 1 బిజెపి స్థానమే నిలబెట్టుకుందన్నమాట. ఇకపోతే తృణమూల్ కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకుంది.. ఇదేమో లోగడ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. అలాగే తమిళనాడులో టిటివి ఒక స్థానం గెలిచింది. ఈ స్థానం గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన జయలలితది. అయితే ఏ మీడియా లోనూ బిజెపి గెలిచినా సమాచారం రాలేదు. దినకరన్ ఘన విజయం, తృణమూల్ జయపతాకం, ఇలా రాశాయి. కానీ తమిళనాడులో బిజెపి అతితక్కువ ఓట్ల గురించి మాత్రం ఎలా రాశాయంటే... తమిళనాడు లో ఘోర పరాభవం, నోటా కంటే తక్కువ.. ఇలా! అసలు బిజెపికి తమిళనాడులో ఉనికే లేదు కదా.. అక్కడ ఎన్ని ఓట్లు వస్తే ఏమిటట? ఉనికే లేని చోట పరాభవం అని తెగ రెచ్చిపోయిన మీడియా మరి గెలిచిన చోట ఎందుకు నిష్పాక్షికంగా వార్త రాయదు? ఇందులో కొసమెరుపు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాలలో కూడా డిపాజిట్ పోగొట్టుకుంది. ఆ విషయాన్నీ కూడా ఏ మీడియా లోనూ మనం చూడలేము. ఇదే పక్షపాతం అంటే. ఇలాంటి రాతలు, వార్తల వలన మీడియా తన విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం