వాట్సాప్ డెడ్ లైన్లు ఇవీ ..


స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులందరికీ వాట్సాప్‌ పరిచయమే. అయితే కొన్ని స్మార్ట్‌ఫోన్‌ ల వినియోగదారులు మాత్రం కొన్ని మాసాల్లో వాట్సాప్‌ కి దూరం అవుతారట. బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, బ్లాక్‌బెర్రీ 10, విండోస్‌ 8.0 అంతకన్నా తక్కువ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్లలో డిసెంబరు 31 తర్వాత వాట్సాప్‌ పనిచేయదు. ఈ రెండు ఓఎస్‌లకు ఈ ఏడాది జూన్‌తోనే వాట్సాప్ ఆగిపోవాలి.. అయితే ఆ గడువును డిసెంబరు 31 , 2017 వరకూ పొడిగించింది. నోకియా ఎస్‌40 ఫ్లాట్‌ఫాంపై పని చేసే మొబైల్‌ ఫోన్లకు 2018 డిసెంబరు 31 వరకూ వాట్సాప్‌ సేవలు లభిస్తాయి. ఇక ఆండ్రాయిడ్‌ 2.3.7 అంతకన్నా పాత (జింజర్‌బ్రెడ్‌) ఓఎస్‌లతో నడిచే ఫోన్లలో వినియోగదారులు 2020 ఫిబ్రవరి 1 వరకూ వాట్సాప్‌ను వినియోగించుకోవచ్చు. 2017 జూన్‌ 30తో సింబియన్‌ ఎస్‌60 మొబైళ్లలో వాట్సాప్‌ సేవలు ఆగిపోతాయి.

ముఖ్యాంశాలు