27 న ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి


27 వ తేదీ బుధవారం ఏపీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పర్యటించనున్నారు. ఉదయం 9.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు రాష్ట్రపతి చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు ఏఎన్‌యూలో ఇండియన్‌ ఎకనామిక్ అసోసియేషన్‌ శతాబ్ధి వేడుకలను ప్రారంభిస్తారు. 11.45కి సచివాలయంలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.50 గంటలకు సచివాలయం బ్లాక్‌-1లోని రియల్‌టైమ్‌ గవర్నెనెన్స్ సెంటర్‌ను పరిశీలించనున్నారు. మద్యాహ్నం 3.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రాష్ట్రపతి కోవింద్‌ తిరుగు ప్రయాణమవుతారు.

ముఖ్యాంశాలు