తాజ్ సందర్శకులపై త్వరలో ఆంక్షలు


తాజ్‌మహల్‌ సందర్శకుల సంఖ్యను ఇకపై పరిమితం చేయాలని పురావస్తు శాఖ ఆంక్షలు విధిస్తున్నది ఈ పురాతన కట్టడాన్ని కాపాడేందుకు రోజువారీ పర్యటకుల సంఖ్యను 40వేలకు పరిమితం చేయాలని సాంస్కృతిక శాఖ కార్యదర్శి రవింద్ర సింగ్‌, పురావస్తు శాఖ అధికారులు, ఆగ్రా జిల్లా యంత్రాంగం, సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది తదితరుల సమావేశం నిర్ణయించింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కలిపి 40వేల టిక్కెట్లు మాత్రమే అమ్మాలని, ప్రతి టిక్కెటుపై తాజ్‌ సందర్శనకు మూడు గంటల కాల పరిమితి మాత్రమే నిర్బంధం చేయాలని ప్రతిపాదించారు. ఏటా తాజ్ వీక్షకుల సంఖ్య 10 నుంచి 15శాతం పెరుగుతోంది. ఒకోసారి రోజుకు 60వేల నుంచి 70వేల మంది కూడా ఉంటున్నారు. కాగా వీక్షకుల సంఖ్యను పరిమితం చేసే విషయంలో నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నివేదిక మేరకు నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

ముఖ్యాంశాలు