ప్రధాని ఆస్తులు రూ.2 కోట్లు

 ప్రధాని స్థాయికి ఎదిగిన ఛాయ్‌వాలా నరేంద్రమోదీ. పన్నెండేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసి.. నాలుగేళ్లు ప్రధానమంత్రిగా పదవీ కలం పూర్తి చేసుకున్నారు ఆయన. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ప్రధాని మోదీ ఎంత సంపాదించారంటే  అక్షరాలా రూ.2.28కోట్లు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్తుల వివరాలను కేంద్రప్రభుత్వం తాజాగా వెల్లడించింది. మార్చి 31, 2018 నాటికి ప్రధాని మోదీ చేతిలో ఉన్న డబ్బు రూ. 48,944. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 2.28కోట్లు. ఇందులో రూ. 1.28కోట్లు చరాస్థులు కాగా గాంధీనగర్‌లో 2002 లో ఆయన లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన 900 గజాల నివాస స్థలం స్థలం విలువ ఇవాళ రూ. కోటి. గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌ బ్రాంచీలో ప్రధాని మోదీకి ఖాతా ఉంది. మార్చి 31 నాటికి అందులో రూ. 11,29,690 నిల్వ ఉన్నాయి. ఇక ఇదే బ్రాంచీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మల్టీ ఆప్షన్ డిపాజిట్‌ స్కీమ్‌ల రూపంలో మోదీ పేరుపై రూ. 1.07కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రూ. 5.18లక్షల విలువ గల జాతీయ పొదుపు బాండ్‌, రూ. 1.59లక్షల విలువ గల జీవిత బీమా పాలసీ ఉంది. ఆయన పేరుపై ఎలాంటి వాహనాలు లేవు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి ఆభరణాలు కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం ఆయన వద్ద రూ. 1.38లక్షల విలువ గల నాలుగు బంగారు ఉంగరాలు  ఉన్నాయి. మోడీ ఏ బ్యాంకు నుంచి రుణాలు కూడా తీసుకోలేదు. 

Facebook