అంతర్జాతీయ లక్ష్యాలకు దీటుగా అటవీ అకాడమీలో శిక్షణ

అంతర్జాతీయంగా అటవీ విధానాలలో వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకోవడం, ప్రపంచవ్యాప్త లక్ష్యాలను చేరుకోవడం అటవీ అధికారుల ముందున్న పెద్ద సవాలు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్ జెఎస్ఎన్ మూర్తి అన్నారు. ఈ సవాలును  అధిగమించే స్థాయిలో క్షేత్రస్థాయి సిబ్బందిని నిపుణులుగా తీర్చిదిద్దడమే అకాడమీ లక్ష్యమని చెప్పారు. దివాన్ చెరువులోని రాష్ట్ర అటవీ శిక్షణాసంస్థ లో మూడవ బ్యాచ్ సెక్షన్ అధికారులు, ఐదవ బ్యాచ్ బీట్ అధికారుల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. రెండు విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలనుంచి మొత్తం 56 మంది అటవీ అధికారులు చేరారు. శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అకాడమీ డైరెక్టర్ మూర్తి ప్రసంగిస్తూ ఎఫ్ బిఓ లకు ఆరు నెలలు, ఎఫ్ఎస్ఓ లకు ఏడాది పాటు శిక్షణ ఉంటుందన్నారు. మొత్తం 17  సబ్జెక్టులను అత్యున్నత ప్రమాణాలతో బోధించడం జరుగుతుందన్నారు. ఐఎఫ్ఎస్ శిక్షణకంటే ఎక్కువ సిలబస్ ను, సబ్జెక్టులను అకాడమీ పరిధిలో క్షేత్రస్థాయి సిబ్బందికి అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు. దీనికి అదనంగా డ్రైవింగ్ ను కూడా నేర్పడం జరుగుతోందన్నారు.  ఫారెస్ట్రీ అనేది అంతర్జాతీయంగా ఒక కీలక రంగంగా మారిందని, నానాటికీ ప్రాముఖ్యత పెరుగుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్తాయి సిబ్బందిని ఆ ప్రమాణాలకు దీటుగా తయారు చేయడం అకాడ

 

మీ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా కర్బన ఉద్గారాల తగ్గింపు, అటవీ ప్రాంతాల సాంద్రతను కాపాడడం అటవీ అధికారులకు ఛాలెంజ్ అన్నారు. 2029 నాటికి 50  శాతం గ్రీన్ కవర్ అనే లక్ష్యాన్ని ప్రభుత్వం అటవీశాఖ ముందు ఉంచిందన్నారు. దీన్ని చేరుకోవాలంటే అటవీ సిబ్బంది ఉద్యమస్థాయిలో కృషి చేయడం తప్పనిసరి అని మూర్తి సూచించారు. మొక్కలపై ప్రేమను పెంచుకోవడం, వాటి నిజమైన ఉపయోగాలు తెలుసుకోవడం ద్వారా మాత్రమే మొక్క జాతుల్ని సంరక్షించడం  సాధ్యమని ఫ్యాకల్టీ సభ్యుడు వైవివి రమణ అన్నారు. శిక్షణ ప్రారంభ కార్యక్రమాన్ని అకాడమీ డైరెక్టర్ జ్యోతి వెలిగించి ప్ర