డబ్బు తీసుకోమని చెప్పేవారు నాయకులా?


ఎన్నికల్లో అందరి దగ్గరా డబ్బులు తీసుకోండి... ఓటు మాత్రం మా పార్టీకి వేయండి.. ఇలా చెప్పడం ఈ మధ్య ప్రతి వాడికీ ఓ పేషన్ అయిపోయింది. ఖర్చు లేకుండా అధికారంలోకి రావాలన్న తాపత్రయం కనిపిస్తోంది తప్ప ఇందులో నిజాయితీ గానీ, ప్రజాస్వామ్యంపై ఆపేక్ష గానీ ఏమాత్రం లేవు. ఇది ఆయా నాయకులకి ఓటర్ల పట్ల ఉన్న చవకబారు దృక్పథానికి నిదర్శనం. ఓటుకి డబ్బులు తీసుకోవద్దని చెప్పి.. తాను ఇవ్వకుండా ఉండి ఓడిపోయినా ఇంతకంటే గౌరవమే. తాను మాత్రం సీట్లు అమ్ముకొని, పార్టీకోసం డొనేషన్లు తీసుకొని... ఒకరకంగ్గ చెప్పాలంటే వ్యాపారం చేస్తూ.. జనాలకి మాత్రం ఇలాంటి దొంగనీతులు చెప్పేవాళ్ళని నమ్మకండి. వాళ్ళు ఎవ్వరైనా సరే!

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం