ఘనంగా ప్రెస్ క్లబ్ కార్తిక వనసమారాధన


ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం కార్తిక వనసమారాధన ఘనంగా నిర్వహించారు. దోసకాయపల్లి రోడ్డు బి .వి.ఎన్. రెడ్డి మామిడితోటలో ఆహ్లాదకర వాతావరణం లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, డెస్క్ జర్నలిస్టులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలు,పెద్దలు ఆటపాటలతో ఈ కార్యక్రమం సందడి గా సాగింది. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మండెల శ్రీరామమూర్తి, అధ్యక్షులు కుడుపూడి పార్ధసారధి, ఉపాధ్యక్షులు దీక్షితుల సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసా ద్, కోశాధికారి శ్రీపాదపురుషోత్తం తదితరుల నేతృత్వంలో కార్తీక వనసమారాధన కమిటీ కన్వీనర్ చిన్ని శ్రీను ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉసిరిచెట్టు వద్ద కార్తీక పూజల అనంతరం వనసమారాధన మొదలైంది. ఆటపాటలలో విజేతలైన దంపతులు,పిల్లలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. వనసమారాధన కు హాజరైన ప్రతి కుటుంబానికీ ప్రత్యేక జ్ఞాపికగా అక్కడికక్కడే ఫొటోలు తీసి అప్పటికప్పుడు తయారు చేసిన ఫొటో మగ్గు ను అందజేశారు. ఎస్సీ,ఎస్టీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజీ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చియ్యచౌదరి, గుడా ఛైర్మన్ గన్నికృష్ణ, రాజమండ్రి మేయర్ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, వైసీపీ రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా, ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి. ఎపిఐఐసి మాజీ ఛైర్మన్ శిఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, వైసీపీ రాజమండ్రి కన్వీనర్ రౌతు సూర్యప్రకాశరావు, తెలుగుయువత నాయకులు ఆదిరెడ్డి వాసు, హూటల్స్ అసోసియేషన్ రాజమండ్రి అధ్యక్షులు కోసూరి సుబ్బరాజు , జనసేన నేతలు శ్రీ అనుశ్రీ సత్యనారాయణ , రాయపురెడ్డి ప్రసాద్ (చిన్న) రాజమహేంద్రి మహిళ కళాశాల ఛైర్మన్ టికె విశ్వేశ్వరరెడ్డి, స్వర్ణాంధ్ర గుబ్బల రాంబాబు, సమాచార శాఖ డిప్యూటీ డైరక్టర్ ఎం.ఫ్రాన్సిస్, అసిస్టెంట్ డైరక్టర్ గౌరీ మనోరంజన్ , డివిజనల్ పిఆర్వో వెంకటేశ్వరరావు, కోరుకొండ సిఐ రవికుమార్, సీనియర్ జర్నలిస్టులు కృష్ణారావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ పాలపర్తి శ్రీనివాస్, రాజారమేష్ అతిథులకు స్వాగతం పలికారు.

ముఖ్యాంశాలు