విదేశాలకు వెళ్తే ఎస్ పి జి ఉండాల్సిందే


గుజరాత్ లో రాహుల్ గాంధీ కారుపై రాళ్లు రువ్విన ఘటన 2017 లో నమోదైంది. అప్పుడు తమ నేత భద్రతపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆందోళన తెలిపి, కేంద్రాన్ని విమర్శించారు. అప్పుడు నాటి హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ ఏమన్నారంటే... 2016 ,2017 సంవత్సరాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మొత్తం 121 పర్యటనలు చేస్తే వాటిలో 100 పర్యటనల్లో బులెట్ ప్రూఫ్ వాహనాలు వాడకుండా .. పూర్తి స్థాయి ఎస్ పి జి సిబ్బందిని అనుమతించకుండా పర్యటనలు చేసారని చెప్పారు. రాహుల్ తన విదేశీ పర్యటనలప్పుడు కూడా అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికి వెళుతున్నారో చెప్పక, ఎప్పుడు వస్తారో చెప్పకుండా... ఎస్పీజీ సిబ్బందిని తీసుకెళ్లకుండా రహస్య పర్యటనలు చేయడం రాహుల్ కి ఆనవాయితీగా మారింది. దీనివలన అయన భద్రతకు సమస్య ఉండడంతో పటు కేంద్రప్రభుత్వానికి కూడా తలనొప్పి తప్పడంలేదు. పైగా ఎక్కడెక్కడ రాహుల్ ఎవర్ని కలుస్తున్నారో తెలియక.. నిఘా వర్గాలకే చీకాకు తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఓ చర్య తీసుకుంది. ఎస్ ఫై జి భద్రతా పరిధిలో ఉన్న వివిఐపిలు ఇకపై విదేశాలతో సహా ఏ పర్యటనకి వెళ్లినా భద్రతా సిబ్బందిని వెంట తీసుకుపోవాల్సిందేనని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ చర్యతో బహుశా ఇకపై రాహుల్ విదేశీ పర్యటనలు తగ్గవచ్చునని భావిస్తున్నారు!

ముఖ్యాంశాలు