శ్రీనివాస రామానుజన్ జయంతి


నంద్యాల లోని ఆర్ జి ఎం ఇంజినీరింగ్ కాళశాల ఆధ్వర్యంలో నంద్యాల గణిత ఉపాధ్యాయ సంఘం (ఎన్ ఏ ఎం టి) వారు ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్ జీఎం ఆడిటోరియంలో జరిగిన ఈ సభకు ఎన్ ఏ ఎం టి అధ్యక్షులు గంగప్ప అధ్యక్షత వహించారు. అయన మాట్లాడుతూ తమ సంస్థ కార్యకలాపాలను, సాధించిన అభివృద్ధిని వివరించారు. ఆర్ జి ఎం డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ ప్రసంగిస్తూ, నిత్య జీవనంలో గణితం యొక్క ప్రాముఖ్యతని, ఆవశ్యకతను వివరించారు. ఐఐటి ఒలింపియాడ్ పరీక్షల నిర్వహణపై కన్వీనర్ పి జె లారెన్స్ వివరించారు. గీతం విద్యాలయ ఆచార్యులు డాక్టర్ కె.మారుతీప్రసాద్ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలను వివరించారు. గణిత శాస్త్రం పుట్టుకను, సంఖ్యాశాస్త్రాన్ని తెలిపారు. వరంగల్ నిట్ ఆచార్యులు నారాయణరెడ్డి గణితానికి, సైన్సుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని సవిస్తరంగా తెలియజేసారు. ద్రవిడియన్ యూనివర్సిటీ ఫౌండర్, ఉప కులపతి పివి అరుణాచలం ప్రసంగిస్తూ రామానుజన్ జీవితాన్నిప్రభావితం చేసిన వ్యక్తులు, పరిశోధ నలను గురించి తెలియజేసారు. కన్వీనర్ ఎం గోవిందరెడ్డి మాట్లాడుతూ ఎన్ ఏ ఎం టి గత 17 సంవత్సరాలుగా గణితాభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. కళాశాల గణిత విభాగం అధిపతి కెవి సూర్యనారాయణరావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, డాక్టర్ పి సుదర్శనరెడ్డి, డాక్టర్ పి శ్రీదేవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు పురస్కారాలను, యోగ్యతాపత్రాలను అందజేశారు.

ముఖ్యాంశాలు