కారు ఓనర్ కి షాక్ ట్రీట్ మెంట్


సరైన పత్రాలు లేకపోవడం, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం... ఈ రెండు నేరాలకు గాను గుజరాత్ పోలీసులు ఓ కారు ఓనర్ కి ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ చూడండి. అహ్మదాబాద్ కు చెందిన రంజిత్ దేశాయ్ పోర్షే 911 స్పోర్ట్స్ కారును 2019నవంబరులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు. సరైన పత్రాలు లేకపోవడంతో పాటు నంబర్ ప్లేట్ కూడా లేదు. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు విలువ దాదాపు రెండున్నర కోట్లు. అహ్మదాబాద్ ఆర్టీవో అధికారులు కారు యజమానికి రూ.9.8లక్షల జరిమానా విధించారు. వాటిని చెల్లించేందుకు వెళ్లగా ఆ కారు పై ఉన్న పాత రికార్డులను పరిశీలించిన ఆర్టీవో అధికారులు మొత్తం రూ.27.68లక్షలు జరిమానా కట్టాలని తేల్చి చెప్పారు. కారు యజమాని ఆ మొత్తం చెల్లించి తన కారును తీసుకెళ్లాడు.

ముఖ్యాంశాలు