గంగానదిలో జాంటీ రోడ్స్ పుణ్య స్నానం


దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కు భారత్ అంటే చాలా గౌరవం. అతను తన కూతురికి ఇండియా అని పేరు పెట్టుకోవడమే ఆ అభిమానానికి నిదర్శనం. ఈమధ్య ఓ కార్యక్రమం నిమిత్తం భారతదేశం వచ్చిన జాంటీ రోడ్స్ రిషికేష్ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకొని అక్కడ పవిత్ర గంగానదిలో పుణ్యస్నానమాచరించాడు. పవిత్ర గంగా నదిలోని చల్లని నీటిలో స్నానమాచరించడం ద్వారా శారీరకంగా, ఆధ్యాత్మికంగా అనేక ప్రయోజనాలు చేకూరతాయి అని పేర్కొంటూ ఆ ఫొటోను తన సోషల్ మీడియా లో పోస్టు చేశాడు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం