నాగబాబు కబుర్లు !
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల సోదరుడు నాగబాబు చెప్పిన కొన్ని విషయాలు!!
- తమ్ముడు పవన్ కోసం చిరంజీవి తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారు.
- అన్నదమ్ములిద్దరం ఒకే రంగంలో ఎందుకనే ఉద్దేశంతోనే చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు.
- రాజకీయాల్లో తనకంటే పవన్ అద్భుతంగా సేవలు చేయగలడని చిరంజీవి నమ్మకం.
- పవన్ కి ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే తాను ఆ రంగంలో ఉండకూడదని చిరంజీవి నిర్ణయించుకున్నారు
- చిరంజీవికి ఓ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనుందనే ప్రచారంలో వాస్తవం లేదు.
- మెగా అభిమానుల్లో గందరగోళం సృష్టించేందుకే కొంతమంది ఇలా ప్రచారం చేస్తున్నారు.
- ప్రస్తుతం చిరంజీవికి జనసేన సహా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు.
- పవన్ కల్యాణ్ ఆలోచనలను అన్నయ్యగా చిరంజీవి సమర్థిస్తారు.
- చిరంజీవి తన జీవితాన్ని తిరిగి సినిమా రంగానికే అంకితం చేయాలని నిర్ణయించారు. అందుకే రాజకీయాలను వదిలేసి సినిమాలపై దృష్టి పెట్టారు.
- మా కుటుంబంలోని నటులందరికంటే చిరంజీవే సినిమాల్లో బిజీగా ఉన్నారు.
- చిరంజీవి ఏ పార్టీలోకి వెళ్లినా గొప్ప స్వాగతం లభిస్తుంది.. రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం చిరంజీవికి లేదు.
- చిరంజీవికి అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉంటాయి.