పురోహితులను ఆదుకోండి


పౌరోహిత్యాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న పురోహిత బ్రాహ్మణులకు ఈ కరోనా కాలంలో కోలుకోలేని దెబ్బ తగిలిందని అందుకే ప్రభుత్వం ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని ఎపి పురోహిత బ్రాహ్మణ సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ఈమేరకు సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ దీక్షితుల రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేస్తూ... కరోనా నిబంధనల వలన పనులు కోల్పోయి ఎందరో పురోహితులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ,ఇలాంటి సమయంలో ప్రభుత్వం కల్పించుకుని వారికి భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కష్టకాలంలో అందరినీ ఆదుకుంటున్న ప్రభుత్వం పురోహితులను మాత్రం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేసారు. విశాఖ పట్నంలో నిర్వహించిన బ్రాహ్మణ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం గా ఉండడం బాధాకరమని ఆయన వాపోయారు. ఇప్పటికైనా కార్పొరేషన్ ని పటిష్టం చేసి, పురోహిత కుటుంబాలను ఆదుకోవాలని సమాఖ్య గౌరవాధ్యక్షులు యామిజాల నరసింహమూర్తి, అధ్యక్షులు పొదిలనారాయణమూర్తి డిమాండ్ చేసారని తెలిపారు.

ముఖ్యాంశాలు