అటవీ అకాడమీ డైరెక్టర్ గా జెఎస్ఎన్ మూర్తి బాధ్యతల స్వీకరణ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్ గా రిటైర్డ్ ఐ ఎఫ్ ఎస్ అధికారి జె ఎస్ ఎన్ మూర్తి తిరిగి నియమితులయ్యారు. మరో రెండేళ్ల పాటు ఆయనను అకాడమీ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు అయన మంగళవారం ఉదయం స్థానిక అటవీ అకాడమీలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ అకాడమీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించిన రాజమండ్రి అటవీ సంరక్షణాధికారి ఎన్ నాగేశ్వరరావు నుంచి మూర్తి ఛార్జి తీసుకున్నారు. జె ఎస్ ఎన్ మూర్తికి అకాడమీ వద్ద డిప్యూటీ డైరెక్టర్ ఎంవి ప్రసాదరావు, స్టేట్ సిల్వికల్చరిస్ట్ భీమయ్య, ఎసిఎఫ్ ఫణికుమార్ నాయుడు, ఎఫ్ ఎస్ ఓ లు ఎన్ ప్రసాద్, పద్మజ, డిఇఓలు, మూర్తి, జ్యోతి, ఫ్యాకల్టీ సభ్యుడు రమణకుమార్ తదితరులు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు, సిబ్బందితో మూర్తి చర్చించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం