జెఈఈ మెయిన్ లో లక్ష్య ఐఐటి అకాడమీ ఘనవిజయం


జె ఈ ఈ మెయిన్ -2020 ఫలితాల్లో లక్ష్య ఐ ఐ టి అకాడమీ మరోసారి విజయ పతాకం ఎగురవేసి తన ఆధిక్యతను చాటుకుంది. పోటీ పరీక్షల రంగంలో లక్ష్య వరుస విజయాలతో అగ్రగామిగా దూసుకుపోతున్నది. జె ఈ ఈ మెయిన్ -2020 కి ఈసారి జాతీయ స్థాయిలో 12 లక్షలమందికి పైగా హాజరయ్యారు. ఈ పరీక్షల్లో షిర్డీ సాయి జూనియర్ కాలేజీ లక్ష్య అకాడమీ విద్యార్ధి కె వి డి శ్రీహర్ష 99.99 శాతం తో ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరీలో 109 వ స్థానాన్ని పొందాడు. ఇది ఉభయగోదావరి జిల్లాల్లోనే ప్రథమస్థానం. ఏదో ఒక సబ్ క్యాటగిరీలో కాకుండా ఓపెన్ లో ఈ ఘన విజయం లభించడం షిర్డీ సాయి జూనియర్ కాలేజీ అసామాన్య విజయానికి నిదర్శనం. మరో ఎనిమిది మంది విద్యార్థులు 5000 లోపు రాంక్ లను సాధించారు. జి రాహుల్ గుప్త, సి హెచ్ కార్తీక్, పి ప్రణీత్ రెడ్డి , కె సిద్ధి వినాయక్, జి హర్ష ఈ పరీక్షల్లో 99.56 నుంచి 99.86 శాతం సాధించారు.99 శాతం పైగా పెర్సెంటేజిని మొత్తం 13 మంది సాధించారు. మొత్తం లక్ష్య అకాడమీ నుంచి 74 మంది విద్యార్థులు ఈ పరీక్షకి హాజరవగా 57 మంది అడ్వాన్సుడ్ పరీక్షకు అర్హత సాధించారు. విజేతలను సంస్థ అధినేతలు తంబాబత్తుల శ్రీధర్, శ్రీవిద్య అభినందించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం