సంచార సంజీవని సేవలు ప్రారంభం


కోవిద్ 19 టెస్టులు సులభతరం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంచార సంజీవని బస్సు రాజమహేంద్రవరం చేరుకున్న సందర్భంలో ఈ బస్సును బుధవారం ఉదయం సుబ్రహ్మణ్య మైదానం శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం వద్ద పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ / మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషి క్త్ కిషోర్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ, కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిల సమన్వయ అధికారి డాక్టర్ టి రమేష్ కిషోర్, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కోమల, ఎం హెచ్ ఓ డాక్టర్ విన్నూత్న, ఆర్టీసీ ఆర్ ఎం. ఆర్విస్ నాగేశ్వర రావు, డి ఎం సత్యనారాయణ మూర్తి, డాక్టర్ ఎంవిఆర్ మూర్తి, కానుబోయిన సాగర్, అర్బన్ హెల్త్ సిబ్బంది, వాలంటరీ లు ఉన్నారు. ఇంద్ర బస్సుని సంజీవిని సంచార వాహనంగా మార్చారు. బసుకి కన్నాలు పెట్టి, లోపల వైద్యులు , సిబ్బంది ఉంటారు. బయట పేషేంట్ నుంచుంటే, కన్నం ద్వారా టెస్ట్ చేస్తారు. # ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోవిడ్- 19 టెస్ట్ కోసం రూపొందించిన సంచార సంజీవిని వాహనం ద్వారా ప్రతి ఒక్కరూ పరీక్షలు నిర్వహించుకుని తోటివారి శ్రేయస్సు, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సహకరించాలని సూచించారు. # ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాకు మూడు బస్సులను కేటాయించగా రాజమహేంద్రవరం పరిధిలోఒక బస్సు ద్వారా ఈ పరీక్షలు నిర్వహించ నున్నట్లు ఎంపీ తెలిపారు. అర్ధ గంట సమయంలో పరీక్షా ఫలితాలు ఇస్తారని,రాజమహేంద్రవరం పరిధిలోని ఈ వాహనం ద్వారా రోజుకి వెయ్యి దాకా పరీక్షలు చేయవలసిందిగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. # గోదావరి జిల్లాలకు ఒక వ్యాపార కూడలిగా రాజమహేంద్రవరం ఉందని, నేషనల్ హైవే కలుపుకోవడం వలన, ఆర్టీసీ నుండి ప్రయాణికులు రాజమండ్రిలోని దిగడం వలన, అదేవిధంగా ప్రధాన రైళ్లు రాజమండ్రిలో ఆగడం వలన కేసులు పెరుగుతున్నాయని, ఎంపీ పేర్కొంటూ ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. #రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్/ మున్సిపల్ కమిషనర్ అభిషి క్త్ కిషోర్ మాట్లాడుతూ కోవిడ్ పరీక్షల కొరకు ఏర్పాటుచేసిన సంచార సంజీవిని రాజమహేంద్రవరం నగరం, రూరల్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. # కాగా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ప్రజలు మార్కెట్ పనులు నిర్వహించుకోవాలని, 11 గంటల అనంతరం తమ ఇళ్ళలో ఉంటూ ప్రభుత్వాన్ని సహకరించాలని కమీషనర్ చెప్పారు. # వర్షంలో సైతం వరుసలో నిల్చుని పేర్లు నమోదుచేయించుకున్నారు. ఈవేళ 300మందికి పైగా టెస్టులు చేయడానికి ఏర్పాట్లు చేసారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం