చైనాను భారత్ అధిగమిస్తుందన్న సాంక్టమ్‌ రిపోర్ట్


భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతున్నది. 2018లో భారత్ చైనాను దాటేసి ఈ మేరకు ఖ్యాతిని చాటనుంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద మార్కెట్లుగా రూపాంతరం చెందుతాయని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ తాజాగా పేర్కొంది. వ్యవస్థీకృత మార్పులు లేకుండా మిగతా ప్రపంచమంతా తక్కువ వృద్ధిని నమోదు చేస్తుంటే అందుకు భిన్నంగా భారత్‌ సాహసోపేత పథంలో దూసుకుపోతున్నదని, ఆర్థిక సంస్కరణలతో దీర్ఘకాలిక వృద్ధిలో ముందుకు వెళుతున్నదని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక తెలిపింది. చైనాలో వృద్ధిరేటు మందగిస్తోందని కూడా ఈ నివేదిక తెలిపింది. భారత ఈక్విటీ మార్కెట్లు 6-8 శాతం కన్నా అధికంగా రాబడులు అందిస్తున్నాయని వెల్లడించింది. ఐతే పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం ప్రభావం మార్కెట్‌ ఎదుగుదలపై కూడా తప్పక ఉంటుందని పేర్కొంది. సరికొత్త సమ్మిళిత మౌలిక సదుపాయాలను, నూతన సమీకరణాలను భారత ఆర్థిక సంస్కరణలు సృష్టిస్తాయని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో శివగుప్త తెలిపారు. ఆధార్‌, జన్‌ధన్‌, నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను తదితర సంస్కరణలు దీర్ఘకాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తాయన్నారు. నిఫ్టీ 50 ఇప్పుడు జీవితకాల గరిష్ఠాల్లో ఉంది. 10,490-10,580 వద్ద నిలదొక్కుకుంటే కొన్నాళ్లకే 11,200-11,500 స్థాయి ర్యాలీ కొనసాగుతుందన్నారు. దేశీయ మదుపర్లు ఈక్విటీ కొనుగోళ్లు అధికంగా చేపడుతున్నారని తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం