అగ్రహారం.. అమ్మ మనసు


@@@@@ చిన్న వెంకటేశ్వర స్వామి గుడి దాటి అరటిచెట్లబడి మీదుగా వొస్తూవుంటే VSN విలాస్ లోనుంచి వొస్తున్న కమ్మని వాసనకి కడుపులో పేగులు నక నక లాడుతున్నాయి. అయ్య కోనేరు గట్టు దగ్గర ఎడమ చేతి వేపు తిరిగి రుద్రాపట్ల వారి వీధి లో నామాల రాజు గారి ఇల్లు దాటి కొళాయిగట్టు దాటి ఎడమచేతి వేపు ఒక ఇంట్లో ప్రవేశించాడు ఆ 16 ఏళ్ళ కుర్రాడు.

ఇంటిలోకి రాగానే నట్టింటి పక్కనే వున్న సందులోంచి వెనకనున్న నూతి గట్టు దగ్గరకి వెళ్లి కాళ్ళు కడుక్కున్నాడు ఆ అబ్బాయి,

వాడిని చూడగానే ఆ వొచ్చావా రా కూచో ఇప్పుడే పెట్టేస్తా అని మిగిలిన అన్నము కూర, పులుసు, పలుచటి మజ్జిగ వొడ్డించింది ఆ మహా ఇల్లాలు. దాన్నే మహా ప్రసాదం లా ఆవురు ఆవురు మని తిని కంచం శుభ్రం గా కడిగేసి బడికెళ్తానమ్మా అని చెప్పేసి మళ్ళా పెద్ద కాలేజీ కి విజయనగరపు ఎండలో వెళ్లి పోయాడు వాడు. @@@@@@@@@@@@

ఇంకో రోజుకూడా అలాగే వొచ్చి భోజనానికి కూచుంటే, ఇవాళ నాన్న ఊరెళ్ళారు అందుకే కొంచం తక్కువగా ఒండాను ఈ చారు, పెసర పచ్చడే చేశాను.. రా తినేసి వెళ్ళు అంది అమ్మ. మారు మాటాడకుండా ఎప్పటిలాగే వాడు తిని కంచం కడిగేసి మళ్ళా పెద్ద కాలేజీ కి వెళ్ళడానికి తయారవుతుంటే.... " ఒరేయి ఎప్పుడన్నా నీకు కావాల్సి వొస్తే రా. ఒక్క రోజే రావాలని నియమం లేదు ఇంకొక చోట కుదరకపోతే ఆ రోజు ఇక్కడికి వొచ్చేయి అంది ఆ ఇల్లాలు. ఎప్పటిలాగే అలాగే అమ్మ.. అని చెప్పి పెద్ద కాలేజీ వేపు వెళ్ళాడు

ఎవరే అమ్మా ఆ అబ్బాయి అని 5 ఏళ్ళ బాబీ గాడు అడిగితే మన వాళ్లేరా ఊరికి దూరంగా వుంటారు భోజనానికి దూరం కదా అందుకని మనింటికి వొస్తాడు. మళ్ళీ రాత్రి వాళ్ళూరు వెళ్లిపోతాడు. నీకు వరసకి అన్నవుతాడులే.. అని యుక్తంగా సమాధానమిచ్చింది ఆ మహా ఇల్లాలు. పది మంది వొచ్చిపోయే గడప అలవాటు అవ్వడం వలన ఆ సమాధానానికి బాబీ గాడు సమాధానపడిపోయి మళ్ళా తన ఆటల్లో మునిగిపోయాడు పెద్ద పెద్ద చదువులు చదువుకోక పోయినా అగ్రహారం లో పుట్టి విద్యాధికుల కుటంబంలోకి వచ్చింది ఆ ఇల్లాలు. మధ్య తరగతి సంసారమైనా సంస్కారం లో ఆమెకు ఎవరూ సాటి కాదు. @@@@

కాలం గడుస్తూనే వుంది అయ్యకోనేరు తురకల చెరువు గట్టులో మాత్రం అదే గాంభీర్యం... అదే మధ్య తరగతి మనస్తత్వం... ఆ ఇంటి ముందు గది లో ఒక నడి వయస్కురాలు కుర్చీలో కూర్చుని బియ్యంలో వడ్లు ఏరుతున్నది. గుమ్మం దగ్గర ఎవరో కొత్త వ్యక్తి చేతిలో సంచీతో నిలబడి.. సొంత ఇంట్లోకి వచ్చినట్లు కొట్టు గది లోకి వొచ్చి అమ్మ వున్నారా అని అడిగాడు. లోపలినుంచి వచ్చిన శారదమ్మ గారు ఇంట్లోకి వచ్చిన ఆ వ్యక్తిని తేరిపారా చూసి, ఏరా బాగున్నావా... చాలా రోజులయ్యింది రా, కూచో.. అని పలకరించి కుశల ప్రశ్నలు వేస్తుంటే, బియ్యం ఏరుతున్న మధ్య వయస్కురాలు లోపలకి వెళ్లి కాఫీ కలిపి తీసుకొచ్చింది. అతను అమ్మ పక్కనే కూచుని ఇంట్లో అందరి సంగతి అడుగుతూ భోగట్టాలు చేస్తుంటే ఓహో ఎవరో అమ్మకి (ఆమె అందరికీ అమ్మే) తెలిసిన చుట్టాలు కాబోలు అనుకుంది. ఇప్పుడు చెప్పురా రామం ఎలా వున్నావు? పెళ్లయిందా పిల్లలా... ఇలా అన్నీ ప్రశ్నలే. దానికి సమాధానంగా నా సంగతేమి గాని చంటి, చిన్న బుజ్జి ఏమి చేస్తున్నారు, తంబి ఎక్కడున్నాడు లాంటి భోగట్టాలు చేస్తుంటే శారదమ్మగారు తంబి APSEB లో పని చేస్తున్నాడు, చిన్న బుజ్జి MCA మూడవ సంవత్సరం లో వున్నాడు, చంటి MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లైబ్రరీ సైన్స్ చదివి వుద్యోగం రాక ఇంకో MA చదువుతున్నాడు ఇవాళో రేపో ఏదో వుద్యోగం వొస్తుందిలే అని చెప్పింది. అలా కొంతసేపు సంభాషణ అనంతరం రామం తనతో తెచ్చుకున్న చీర ఆ మహా ఇల్లాలికి పెట్టి వొంగి కాళ్ళకి దండం పెడుతుంటే ఎందుకురా నీకు అనవసర ఖర్చు? అమ్మాయికి ఇయ్యి అని సున్నితంగా తోసి పుచ్చితే.. అదేమిటమ్మా.. తంబి గాని, అన్న గాని ఇస్తే తీసుకోవా వొద్దు అనకూడదు.. అని చెప్పి మరొక సారి పాదాభివందనం వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఈలోగా చంటి, చిన్న బుజ్జి ఒకేసారి ఇంట్లోకి వస్తూ.. ఎవరా ఈ కొత్త వ్యక్తి అని కుతూహలంగా చూస్తూ ఉంటే ఆవిడే పరిచయం చేసారు. అప్పుడు రామం మాట్లాడుతూ.. చంటి, చిన్న బుజ్జి మీలాగే నేనూ ఈ ఇంట్లో పెరిగిన వాడినే! మీ బయో డేటా కాపీ ఉంటే ఇవ్వండి తెలిసిన నెట్ వర్క్ లో పంపిస్తా అన్నాడు. అలా అన్నదే తడువుగా వాళ్లిద్దరూ తలా ఒక బయోడేటా ఇచ్చారు. రామం అందరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు. అప్పటి దాక వాకిట్లో పడేసిన బియ్యపు గింజలు తింటున్న పిచ్చుక కూడా రెక్కలు జాచి విహంగమై ఎగురుకుంటూ తన గూటి కి వెళ్ళిపోయింది. @@@@

కాల క్రమేణా ఒక నాలుగు నెలలు గడిచాయి... చంటి కి, చిన్న బుజ్జి కి ఒక రోజున అందమైన FEDEX పోస్ట్ వొచ్చాయి. తీసి చూద్దురు కదా అమెరికా లోని NJIT కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఇద్దరికీ PhD సీట్ తో బాటు పూర్తి స్కాలర్షిప్! రెండు వారాల్లో ఆ ఇద్దరూ మధ్య తరగతి కుటుంబాల కలల సాకార దేశమైన USA ఎగిరి వెళ్లి పోయారు. ఆ కుటుంబం లో సంత