అటవీ అకాడమీ అభ్యర్థులకు వైద్య పరీక్షలు


రాజమహేంద్రవరం దివాన్ చెరువులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఎపి వైద్య విధాన పరిషద్ జిల్లా ఆసుపత్రి, రాజమండ్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డా॥ కె.ఎన్. ప్రసాద రావు తదితర వైద్యసిబ్బంది 21 వ తేదీ ఆదివారం ఉ.11 గంటలనుంచి మధ్యాహ్నం వరకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లో భాగంగా “వాసన్ ఐ కేర్, రాజమండ్రి” వారు నేత్ర పరీక్షలు నిర్వహించారు. వాసన్ ఐ కేర్ తరఫున పి.సూర్య ప్రకాష్ ఇతర సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షలు రాజమండ్రి సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణాధికారి మరియు అటవీ అకాడమీ సంచాలకులు శ్రీ జె.ఎస్.ఎన్.మూర్తి, ఐ.ఎఫ్.ఎస్ ఆధ్వర్యం లో జరిగాయి. అటవీ అకాడమీ ఉప సంచాలకులు వై.ఎస్.నాయుడు, సెక్షన్ అధికారి ఎన్.ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం