ఎలాంటి యుద్ధానికైనా సిద్ధం - రాజ్ నాథ్ సింగ్

దేశ రక్షణ విషయంలో, శత్రువులపై దాడి విషయంలో తమకు ఎలాంటి పరిమితులూ లేవని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేసారు. సొంత గడ్డ నుంచే కాకుండా.. అవసరమైతే సరిహద్దులు దాటిమరీ శత్రువుల అంతు చూసే శక్తి భారతదేశానికి ఉందని ఆయన హెచ్చరించారు. తరచుగా కాల్పులకు తెగబడుతున్న పాక్ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు భారత సైనికులు ఎల్‌వోసిని దాటి దాడి చేసిన ఘటనను ఆయన గుర్తుచేశారు. ఆదివారం యూపీలో ఓ బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంగా ఆయన పాకిస్థాన్ తీరును తీవ్రంగా గర్హించారు. కొద్ది రోజులుగా సరిహద్దుల్లో పాక్ సైనికులు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాదాపు 17 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నదని దీనిని సీరియస్‌గా పరిగణించిన ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ఆదేశాల మేరకు భారత జవాన్లు సరిహద్దు దాటి పాక్ ఉగ్రవాదులను హతమార్చారన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని రాజ్ నాథ్ అన్నారు. శత్రుదేశాలకు ఇదే హెచ్చరిక అంటూ.. ఆయన సింహనాదం చేసారు.  స్వదేశం నుంచే కాదు.. అవసరమై తే శత్రుదేశాల్లోకి వెళ్లి మరీ దాడి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉంది’’ అని హోంమంత్రి స్పష్టం చేశారు.

Facebook