ఘనంగా తొలిప్రేమ ఆడియో వేడుక


వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘తొలిప్రేమ’ ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది. రాశీఖన్నా ఇందులో కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ దీనిని నిర్మించారు. వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘తొలిప్రేమ’ అని టైటిల్ అనేసరికి నాకు నచ్చినా, చాలా భయం వేసింది. ఆ టైటిల్‌ పెట్టుకుంటున్నాం, తేడా జరిగితే బాగోదు అని అప్పుడే వెంకీకి చెప్పా. ఎందుకంటే బాబాయికి మంచి గుర్తింపు తెచ్చిన చిత్రమది. అయితే ఆ పేరు పాడు చేయకుండా ఆ టైటిల్‌కు న్యాయం చేస్తాం. ఆ నమ్మకం నాకుంది. సినిమా చూశాక మీరెవరూ నిరుత్సాహ పడరు. అని వివరించారు. తమన్‌ సంగీతాన్ని వరుణ్ ప్రశంసించారు. తమ పెదనాన్న చిరంజీవి కృషి, పట్టుదల వల్లే మీరంతా(అభిమానులు) వచ్చారని ఆయన పేరును ఎక్కడా తగ్గకుండా కల్యాణ్‌ బాబాయ్‌ పెంచుతూ వెళ్లారని, వారిద్దరూ వేసిన ఈ ఫౌండేషన్‌ను మేము ఎప్పటికీ నిలబెడతాం అని వరుణ్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ముఖ్యాంశాలు