హోటల్ కి రమ్మనలేదు - అక్బర్

పాత్రికేయురాలు ప్రియా రమణిని ఇంటర్వ్యూ కి హోటల్‌కు రమ్మని అడగలేదని కేంద్ర మాజీ మంత్రి ఎం.జె.అక్బర్‌ సోమవారం కోర్టుకి తెలిపారు. 1994లో ఏసియన్‌ ఏజ్‌ పత్రికకు సంపాదకుడిగా ఉన్న అక్బర్‌ ఉద్యోగం కోసం వచ్చిన తనను లైంగికంగా వేధించారని ‘మీ టూ’ ఉద్యమం సందర్భంగా ప్రియా రమణి ఆరోపించారు. ఆ తర్వాత మరి కొందరు మహిళలూ అక్బర్‌పై ఇలాంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో గత ఏడాది అక్టోబరులో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రమణిపై అక్బర్‌ న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేసారు. దీనిపై సోమవారం దిల్లీలోని అదనపు ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సమర్‌ విశాల్‌ ముందు ఇరు పక్షాల వాదనలు కొనసాగాయి. రమణి తరఫు న్యాయవాది  ప్రశ్నలకు అక్బర్‌ సమాధానమిస్తూ తనపై చేసిన ఆరోపణలను గట్టిగా ఖండించారు. 

Facebook
Twitter