పీఎస్‌ఎల్వీ- సీ46 ప్రయోగానికి  కౌంట్‌డౌన్‌

నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్వీ) సీ46 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమయింది.  కౌంట్‌డౌన్  ప్రక్రియ 25 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన అనంతరం పీఎస్‌ఎల్వీ నింగిలోకి దూసుకెళ్ల నుంది. ఈ రాకెట్‌ 615కిలోల బరువున్న రీశాట్‌-2బీర్‌1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. దీని కాలపరిమితి ఐదేళ్లు. రాకెట్‌ ప్రయోగాన్ని ముందు గా బుధవారం ఉదయం 5.27 గంటలకు ప్రయోగించాలని నిర్ణయించారు. ఆ సమయంలో అంతరిక్షంలో వ్యర్థాలు అడ్డు రానుండడాన్ని గుర్తించి మూడు నిమిషాల అలస్యంగా 5.30 గంటలకు చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. 

Facebook
Twitter