అర్థ గిరి క్షేత్ర చరిత్ర


అర్థ గిరి క్షేత్ర చరిత్ర రామాయణ కాలం నాటిది. ఇంద్రజిత్తు తో యుద్ధంలో మూర్చిల్లిన లక్ష్మణుడిని బతికించడానికి మృత సంజీవిని అనే మూలిక అవసరం అయింది. దానికోసం వెళ్ళిన అసాధ్యుడు మారుతి.. మూలిక ఏదో గుర్తించలేక.. మొత్తం సంజీవిని పర్వతాన్నే పెకలించి మోసుకొస్తాడు. అలా వస్తున్నపుడు ఆ పర్వతంలో కొంతభాగం విరిగి నేలపై పడింది... అదే అర్థగిరి.. దీనినే అరకొండ లేదా అరగొండ అని కూడా అంటారు. ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. తిరుపతికి 75 కిలోమీటర్లు, కాణిపాక క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇక్కడ వీరాంజనేయ స్వామి గుడి, సంజీవరాయ పుష్కరిణి ఉన్నాయి. ఈ పుష్కరిణి ఎప్పుడూ ఎండిపోదని, నీళ్ళు కలుషితం కావని అంటారు. ఎన్నో అద్భుతమైన ఔషధీ మూలికల సంగమంగా ఈ పుష్కరిణి అలరారుతోంది. ఇక్కడ స్నానం చేసి.. ఈ స్వామిని సేవిస్తే .సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది అని.. దీర్ఘ రోగాలు కూడా నయం అవుతాయని నమ్మిక. ఇక్కడి వీరాంజనేయుడి విగ్రహం ఉత్తరం వైపుకి తిరిగి ఉండడం విశేషంగా చెబుతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య కిరణాలు స్వామిని తాకడం మరో విశేషం. ఈ క్షేత్రంలో రాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్నపుడు ఓంకార నాదం లీలగా వినిపిస్తుందని చాలామంది భక్తులు చెబుతుంటారు. నమో సంజీవరాయ .. నమో మోహ మారాయ జై వీరాంజనేయ .. జై వీరాంజనేయ

ముఖ్యాంశాలు