తెలుగు చిత్ర సీమపై మాఫియా వల


ఇన్నాళ్లూ మాఫియా గురించి సినిమాలు మాత్రమే తీసిన తెలుగు చిత్ర ప్రముఖులకు ఇప్పుడు మాఫియా ఎలా ఉంటుందో అవగతం అవుతోంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో భారీ వ్యాపారం నిర్వహిస్తున్న తెలుగు చిత్రాలపై ఇప్పుడు మాఫియా కన్ను పడింది. లోగడ జవాన్ చిత్రానికి, ఇప్పుడు దిల్ రాజు నిర్మించిన ఎం సి ఏ (నాని హీరో) చిత్రానికి మాఫియా బెదిరింపులు వచ్చాయి. ఈ చిత్రాన్ని పైరసీ చేశామని.. తాము అడిగినంత డబ్బు చెల్లించకపోతే విడుదలకి ముందే సినిమాని మార్కెట్లో వదిలేస్తామని దిల్ రాజు ను మాఫియా వర్గాలు బెదిరించాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ క్రేజీ సినిమా అజ్ఞాత వాసి కి కూడా ఈ ఇబ్బందులు ఎదురైనట్లు భోగట్టా. దిల్ రాజు అయితే ఈ విషయమై హైదరాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు, అజ్ఞాతవాసి యూనిట్ ఇంకా స్పందించలేదు.

ముఖ్యాంశాలు