నిర్మాతగా అల్లు అర్జున్


స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నిర్మాత అవతారం ఎత్తుతున్నారని టాలీవుడ్‌ వర్గాల భోగట్టా. ఆయన తండ్రి అల్లు అరవింద్‌ ‘గీతా ఆర్ట్స్‌’ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై చిత్రాలు నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత అనే విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు బన్నీ కూడా తన పేరిట సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇకపై తీయబోయే సినిమాలను బన్నీ ఈ నిర్మాణ సంస్థ మకుటం పైనే నిర్మిస్తారని సమాచారం. త్వరలో అనూప్‌ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ చిత్రంలో నటించనున్నారట. ఈ సినిమాకి ఆయనే నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. కాగా నిర్మాణ సంస్థ ఏర్పాటు గురించి త్వరలో అర్జున్‌ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో నటిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ముఖ్యాంశాలు